కుండపోతగా కురిసిన వాన ఒక్కసారిగా ఆగిపోయింది
ఆకాశం తనకి నచ్చనిదేదో జరిగినట్టు మొహం నల్లగా పెట్టుకుంది
రోడ్ల మీద టైర్లు కాల్చిన నల్ల పొగ నిండి పోయింది
గణేష్ నిమజ్జనం సందడి లేదు
కాంగ్రెస్ జెండా ఒక్కసారిగ నిస్తేజంగా కనపడుతుంది
గాంధీ భవన్ ముందు దొంగ ఏడుపుల కన్నా నిజంగా ఏడ్చేవారు ఎక్కువ కనపడుతున్నారు
టీవీ చానల్స్ ప్రముఖుల అభిప్రాయాలూ అడుగుతున్నాయి
యెన్ టీవీ ఛానల్ డెత్ న్యూస్ అదే ఫస్ట్ పబ్లిష్ చేసింది అని గొప్పగా స్క్రోల్లెర్ వేసుకుంటుంది
ఇవ్వాల ఎం జరిగింది
చాల మంది నాయకులు చనిపోయారు , ఎప్పుడు ఇంత ఆలోచన చెయ్యలేదు
ఒక రాజకీయ నాయకుడి గురించి ఇంత నిజాయితీగ ఎప్పుడు ఆలోచించలేదు
తానూ తింటూ పక్కనోడికి పెట్టె వాడు మనిషి
పక్కనోడి బాధ తన బాధ అని నిజంగ ఫీల్ అయ్యే వాడు నాయకుడు
చంద్ర బాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడిని ఎదుర్కొని రెండు సార్లు ప్రతిపక్షంలో కుర్చోపెట్టిన నాయకుడు
YSR నిజమైన నాయకుడు , నేను ఎప్పటికి మర్చిపోలేని నాయకుడు ,
తన ఆత్మకి శాంతి జరగాలి అని ఒక నాయకుడి గురుంచి ప్రార్ధించా ఈ రోజు .
Thursday, September 03, 2009
Subscribe to:
Posts (Atom)